గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,102 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 278 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,64,522కు చేరాయి. పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది. వైరస్ సోకిన వారిలో ఇప్పటి వరకు 4,21,89,887 మంది కోలుకున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా 176 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.