రౌడీబాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే చిత్రయూనిట్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అందుకు ఆమె ఒప్పుకుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. యశ్ హీరోగా నటించిన ‘KGF’ సినిమాలో శ్రీనిధి హీరోయిన్ గా నటించింది.
