సోమవారం రాత్రి విడుదలయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌పై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకి ‘భీమ్లా నాయక్’ అని కాకుండా ‘డానియల్ శేఖర్’ అని పెట్టాల్సింది అంటూ వర్మ ట్వీట్ చేశాడు..
వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ.. వర్మపై ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఈ ట్రైలర్లో చెప్పిన డైలాగ్‌ని వర్మకి అనుకరిస్తూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.
నిజంగానే వర్మకు అలా అనిపించిందో.. లేక పవన్ కల్యాన్ ఫ్యాన్స్‌ని ఈ టైమ్‌లో కెలికితే ఎలా ఉంటుందో చూడాలని ట్వీట్ చేశాడో తెలియదు కానీ.. పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి వర్మ గురికాకతప్పడం లేదు.