తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ ..ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఇంట ప్రతీరోజూ పండగే. త్వరలో ఆమె తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్షణాల్ని, ఈ అపురూపమైన ఘడియల్ని కాజల్ – గౌతమ్ కిచ్లు ఆస్వాదిస్తున్నారు.
ఇటీవలే కాజల్ సీమంతం కూడా వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కాజల్ స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. ఆ ఫొటోల్ని కాజల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రాలు నెట్టింట వైరల్ అయ్యాయి. 2020లో కాజల్, గౌతమ్ల వివాహం జరిగింది. కొంతకాలంగా కాజల్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె నటించిన ‘ఆచార్య’ త్వరలో విడుదల కానుంది. ‘హే అనామిక’ అనే మరో చిత్రం మార్చి 3న రాబోతోంది.