గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కొన్ని సార్లు ఏకంగా రెండు లక్షల నుండి 3 లక్షల 60 వేలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు ప్రస్తుతం 10 వేలకు చేరువయ్యాయి. కొత్త కేసులు తగ్గిపోవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు, యాక్టివ్ కేసులు 1 శాతం దిగువకు పడిపోయాయి.
దేశంలో తాజాగా కొత్తగా 13,405 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,28,51,929కి చేరాయి. ఇందులో 4,21,58,510 మంది బాధితులు కోలుకోగా, 5,12,344 మంది మృతిచెందారు. మరో 1,81,075 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇది మొత్తం కేసుల్లో 0.42 శాతమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడింది. అదేవిధంగా పాజిటివిటీ రేటు కూడా 1.24 శాతానికి పడిపోయిందని తెలిపింది.
ఇక గత 24 గంటల్లో 34,226 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని, 235 మంది మరణించారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1,75,83,27,441 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.