తెలంగాణలో ‘భీమ్లా నాయక్’ టికెట్లు బుక్ మై షో ద్వారా అమ్మకూడదని నైజాం ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. టికెట్ ధరపై BMS అదనంగా విధించే సర్వీస్, హ్యాండ్లింగ్ ఛార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ ఛార్జీల నుంచి ప్రతి టికెట్స్ పై రూ.10ని థియేటర్ యాజమాన్యాలకు బుక్ మై షో చెల్లిస్తోంది. దీన్ని రూ.15కు పెంచాలనే డిమాండుతోనే ఈ సంస్థకు బుకింగ్ అనుమతి ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.