టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ నుండి కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ తనదైన మార్క్ దూసుకెళ్తున్నాడు. తాజాగా వెస్టిండీసు 3-0తో చిత్తు చేసిన భారత్ టీ20 ర్యాంకింగ్స్ టాప్ ప్లేస్ కు చేరుకుంది. రోహిత్ నాయకత్వంలో భారత్ వరుసగా మూడు టీ20 సిరీస్లను వైట్వాష్ చేయడం విశేషం. ఇందులో న్యూజిలాండ్తో ఒకటి.. విండీస్తో రెండు సిరీస్లున్నాయి.
