ఒకప్పుడు సీమ కథలకు భలే గిరాకీ ఉండేది. అగ్ర హీరోలంతా.. రాయలసీమ ఫ్యాక్షనిజం చుట్టూ కథలు అల్లుకుని అందులో హీరోయిజం చూపించారు. చిరంజీవి సైతం ‘ఇంద్ర’సేనారెడ్డిగా అలరించారు. చాలా కాలం తరవాత.. ఇప్పుడు మళ్లీ సీమ నేపథ్యంలో ఓ కథని ఎంచుకున్నట్టు సమాచారం.
చిరంజీవి కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. డి.వి.వి దానయ్య నిర్మాత. ఈ కథంతా రాయల సీమ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఫ్యాక్షనిజం చుట్టూ ఈ కథ నడిచినా… పగలూ – ప్రతీకారాలు ఉండవని, సరదా సరదా సన్నివేశాలతో కథ నడుస్తుందని తెలుస్తోంది.
‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలలో పసందైన వినోదం పండించారు వెంకీ కుడుముల. చిరంజీవి కోసం కూడా అలాంటి వినోదాత్మక కథనే రాస్తున్నార్ట. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ చిత్రాలో బిజీగా ఉన్నారు చిరు. ఇవి పూర్తి కాగానే… వెంకీ కుడుముల కథని సెట్స్‌పైకి తీసుకెళ్తారు.
Post Views: 552