త్వరలోనే తన తండ్రి, మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాశ్ పదుకొణె బయోపిక్ తీస్తున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రకటించింది. ‘భారత్లో క్రీడల గురించి మాట్లాడుకునేలా చేసిన వ్యక్తుల్లో మా నాన్న ఒకరు.
1981లోనే ఆయన బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. ఇప్పుడున్నంత అధునాతన సౌకర్యాలు లేకపోయినప్పటికీ తను ఒక్కో మెట్టూ ఎదిగారు.’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.