భారతీయుల్లో బంగారం అంటే ఎంతో ప్రీతి. పుత్తడి కొనుక్కోవాలని.. ఆభరణాలు చేయించుకోవాలని మహిళలు ఆరాటం చూపుతారు. అలాగని బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు.. పెట్టుబడికి మార్గం కూడా.. ధర తగ్గినప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టడం శుభ తరుణం అని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
గతేడాది రూ.43 వేల వద్ద ఉన్న తులం బంగారం ఇప్పుడు రూ.50వేలకు చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు వీడిపోయినా పుత్తడి ధర పెరుగుతూనే ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1900 డాలర్లకు చేరుకున్నది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన ధర తగ్గుముఖం పడుతున్నది. ధర తగ్గడటంతో ప్రాఫిట్ రికవరీ సాధించేందుకు ఆస్కారం ఉంది. మూడు, నాలుగు నెలల తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2000 డాలర్లకు పెరుగుతుందని అంటున్నారు.