Home / EDITORIAL / వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా Latest InterView

వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా Latest InterView

ఐదేండ్ల క్రితం గోదావరిని చూశా. ఎండిపోయి ఉన్నది. ఇప్పుడు 200 కిలోమీటర్ల మేరకు సజీవంగా పారుతున్నది. ఇది తెలంగాణ జల సంకల్పానికి నిదర్శనం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో ఏడేండ్లలోనే జీరో నుంచి హీరోగా ఎదిగింది. నదికి నడక నేర్పిన ఘనత ఆయనదే. అన్ని రాష్ర్టాలు తెలంగాణ బాటలో నడవాలి. తెలంగాణ సీఎం మరో ముందడుగు వేసి వాటర్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే బాగుటుంది. జల సంరక్షణపై దేశానికి మార్గదర్శనం చేయాలి. ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చని నదుల అనుసంధానం ప్రాజెక్టును ప్రైవేటు కంపెనీల కోసమే కేంద్రం చేపట్టింది. కేంద్ర విధానాలపై ప్రజలంతా ఉద్యమించాలి’ అని పిలుపునిచ్చారు వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా ఖ్యాతి పొందిన రాజేంద్రసింగ్‌. ఆయన హైదరాబాద్‌ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో తన అభిప్రాయాలు పంచుకున్నారు.

చాలా కాలం తరువాత తెలంగాణకు విచ్చేశారు? ఏమైన మార్పును గమనించారా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో వచ్చాను. చాలా ఏండ్ల తరువాత ఇప్పుడు వచ్చా. గతంలో నేను చూసిన ఈ ప్రాంతానికి, ఇప్పటి పరిస్థితికి పోలికే లేదు. హైదరాబాద్‌ నగరం రూపురేఖలే మారిపోయాయి. ఎక్కడ చూసినా పచ్చదనమే. చాలా ముచ్చటగా ఉన్నది. యాదాద్రి వెళ్లే మార్గంలో చెరువులను కూడా చూశా. గతంలో ఇక్కడ చెరువులన్నీ ఎండిపోయి ఉండేవి. ఇప్పుడు నిండుగా కళకళలాడుతున్నాయి. ప్రకృతి రమణీయత, ఆహ్లాదకర వాతావరణం బాగుంది. కేవలం ఏడేండ్లలోనే జీరో స్థాయి నుంచి హీరోస్థాయికి ఎదిగింది. ఇది అభినందనీయం.

నదుల అనుసంధానంపై మీ అభిప్రాయం?
కేంద్రం ప్రకటించిన నదుల అనుసంధాన ప్రాజెక్టు నిరర్థకం. దేశ ప్రగతికి, ప్రజానీకానికి వీసమెత్తు ప్రయోజనం లేదు. సహజ నీటి సూత్రాలకు, రాజ్యాంగం కల్పించిన నీటి హక్కులకు పూర్తి విరుద్ధం. నది పరివాహక ప్రాంతంలోని వారికే ఆ నీటిపై పూర్తి హక్కు ఉం టుంది. మరయితే కరువు ప్రాంతాలకు నీరు వద్దా అంటారు. నిజమే నీరు అందరికీ అవసరం. కానీ నదులను అనుసంధానించడం ద్వారా కాదు. ఇది తాత్కాలిక పరిష్కారాన్ని చూపుతుందే తప్ప శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వదు. అసలు కరువు ప్రాంతాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? నీటి సంరక్షణ, నిర్వహణ, వినియోగంపై ప్రజలకు అవగాహన లేకపోవడం వల్లనే. దీనిపై సరైన చర్యలు చేపడితే కరువు ప్రాంతాలే ఉం డవు. ఇది నా అనుభవం నుంచి చెప్తున్న మాట. రాజస్థాన్‌, మహారాష్ట్రలోని తీవ్ర వర్షాభావ ప్రాంతాల్లో కూ డా దీనిని ఆచరణలో అమలు చేసి చూపిం చాం. 11 నదులను పునరుద్ధరించాం. ఎడారి ప్రాంతాల్లో పచ్చదనం నింపాం. నేను చెప్పే మార్గం తక్షణ ఫలితాలివ్వకపోవచ్చు కానీ, శాశ్వత పరిష్కారం మాత్రం ఇస్తుంది.

కేంద్ర సర్కారు జలవిధానాలు ఎలా ఉన్నాయి?
కేంద్రంలో బీజేపీ సర్కారు ఏడేండ్లుగా అనుసరిస్తున్న జలవిధానాలన్నీ ప్రజా వ్యతిరేకమైనవే. అన్నింటికంటే ప్రమాదకరమైన విషయం నీటిని ప్రైవేటీకరించి, పూర్తిగా వాణిజ్యసరుకుగా మార్చే కుట్ర. డ్యామ్‌ సేఫ్టీ బిల్‌, రివర్‌ బేసిన్‌ మేనేజ్‌మెంట్‌ బిల్‌ పేరిట నీటివనరులను గుత్తాధిపత్యంలోకి తీసుకొస్తున్నది. దీనిపై అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులను గతంలోనే హెచ్చరించా. ఒక్కరూ పట్టించుకోలేదు. ఇప్పుడు అనుభవంలోకి వస్తుంటే తెలుస్తున్నది. ఈ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నది.

గాంగా నది రిజువనేషన్‌ ప్రాజెక్టు సజావుగా సాగకపోవటానికి కారణం?
ఎప్పుడైనా ఎక్కడైనా నినాదాలతో పనులు కావు. నిధులు ఖర్చు పెట్టినంత మాత్రాన ఫలితాలు రావు. ప్రజల భాగస్వామ్యం ఉండాలి. నీటి సంరక్షణే కాదు నిర్వహణ, వినియోగంపై వారికి సంపూర్ణ అవగాహన ఉండాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. అందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకమే నిదర్శనం. కేంద్రం ఆ విధానాలను చేపట్టడం లేదు. ప్రజలను ఆ దిశగా చైతన్యవంతులను చేయడం లేదు. అందుకే గంగా రిజువనేషన్‌ ఏండ్లు గడిచినా ముందుకు సాగడం లేదు. దాని ఆశయం నేరవేరదు.

తెలంగాణ జలసంరక్షణ విధానాలు ఎలా ఉన్నాయి?
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ విధానాలు భేష్‌. ఐదేండ్ల క్రితం గోదావరిని చూశా. ఎండిపోయి ఉన్నది. ఇప్పుడు 200 కిలోమీటర్ల మేరకు సజీవమైంది. ఇది తెలంగాణ జల సంకల్పానికి నిదర్శనం. మిషన్‌ కాకతీయ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్న చిన్న వాగులను కూడా విడవకుండా చెక్‌డ్యామ్‌లను కడుతున్నారు. ఫాం పాండ్స్‌, రిచార్జ్‌ పిట్స్‌ నిర్మించుకొనేలా ప్రోత్సహిస్తున్నారు. అన్ని కోణాల నుంచి వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు కృషి చేస్తున్నారు. నీటితోనే అభివృద్ధి ముడిపడి ఉంటుంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో గడిచిన ఏడేండ్లలోనే జీరో నుంచి హీరోగా ఎదిగింది. అన్ని రాష్ర్టాలు తెలంగాణ బాటలో నడవాలి.

తెలంగాణ ప్రభుత్వానికి మీరిచ్చే సలహాలు?
తెలంగాణ సర్కార్‌ జలసంరక్షణకు ఏడేండ్లలో అనేక చర్యలు చేపట్టింది. వాటి ఫలితాలను కూడా చూస్తున్నాం. అందుకే దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌. అన్ని రాష్ర్టాలు తెలంగాణ బాటలో నడవాలి. జాతీయ సదస్సును కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తెలంగాణ కృషిని దేశ నలుమూలలా చాటి ఆ స్ఫూర్తిని నింపాలనే. తెలంగాణ సీఎం మరో ముందడుగు వేసి వాటర్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. జల సంరక్షణపై దేశానికి మార్గదర్శనం చేయాలి. అదే సమయంలో నీటి సంరక్షణ, నిర్వహణ, వినియోగంపై రైతులకు కూడా అవగాహన కల్పించాలి. వరి సాగును వద్దంటున్నారు.. బాగుంది. ఇతర పంటల సాగును మరింత ప్రోత్సహించాలి. రైతులకు తగినంత ఆర్థిక ప్రోత్సాహమిస్తేనే అది సాధ్యం.

యాదాద్రి అనుభూతి కలిగింది.?
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం అద్భు తం. రాతితో కట్టినంత మాత్రాన ఆధ్యాత్మిక పరిమళం వెదజల్లదు. ప్రకృతితో మమేకం కావాలి. అలాంటి రమణీయతను యాదాద్రిలో చూశా. స్వయంగా అనుభూతి చెందా. ఆలయంలో అడుగుపెట్టగానే నా మనసులో మెదిలిన భావాలను మాటల్లో చెప్పలేను. ఎత్తయిన కొండపై నుంచి కిందకు చూస్తే మూడుదిక్కులా నిండుకుండలా ఉన్న చెరువులు. పచ్చదనం. మనసు పరవశించిపోయింది.

రాష్ర్టాల మధ్య నదీజలాల వివాదాలకు కారణం?
నీటిని వినియోగంలో అవగాహన లేకపోవడం. సరైన వ్యవసాయ విధానాలు పాటించకపోవడం. నీరు సమృద్ధిగా ఉన్నప్పుడూ, కొరత ఉన్నప్పుడూ అలాగే వాడుకుంటాం అనే వైఖరి వల్లే ఈ వివాదాలు. కావేరి వివాదమే ఇందుకు ఉదాహరణ. కొన్ని రాష్ర్టాల్లో ఒక టీఎంసీ నీటితో కేవలం మూడువేల ఎకరాలు సాగు చేశారు. ప్రాంతానికి, నేలలకు అనుగుణంగా పంటల సాగు ఉండాలి. కొన్ని రాష్ర్టాలు ఆ పని చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఒక టీఎంసీతో 12-13 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నది. ఆరుతడి పంటలను వేయాలని సూచిస్తున్నది. ఇది చాలా గొప్ప విషయం.

కాళేశ్వరం ప్రాజెక్టుపై మీ అభిప్రాయం..?
నేను వ్యక్తిగతంగా పెద్ద డ్యామ్‌ల నిర్మాణానికి వ్యతిరేకం. కానీ తెలంగాణ సర్కారు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అందుకు మినహాయింపు. ఆ ప్రాజెక్టు వల్లే నేడు గోదావరి సజీవమైంది. ఆ ప్రాజెక్టు గొప్పదనం ఏమిటంటే నీటిని పెద్ద మొత్తంలో నిల్వచేయడం లేదు. వేలు పట్టి నడిపిస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే నదికి నడక నేర్పిన ఘనుడు సీఎం కేసీఆర్‌. ఎక్కడ నుంచి నీరు మొదలవుతుందో తిరిగి అక్కడికే చేరేలా డిజైన్‌ చేయడం అద్భుతం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat