మేడారం సమ్మక్క, సారలమ్మలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తులాభారం వేసి అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మేడారం జాతర కుంభమేళాను తలపించేలా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు.
గతంలో ఎన్నడు లేని విధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. అమ్మవార్ల దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.