ఆర్‌బీఐ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2022లో భాగంగా దేశవ్యాప్తంగా తమ కార్యాలయాల్లో పనిచేసేందుకు 950 అసిస్టెంట్ పోస్టులను భర్త చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆర్‌బీఐ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ పోస్టుల కోసం మార్చి 8లోగా ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్‌బీఐ రిక్రూట్‌మెంట్ 2022 కోసం ఆన్‌లైన్ ప్రిలిమినరీ టెస్ట్‌ను మార్చి 26, 27 తేదీల్లో నిర్వహిస్తారు.
రెండు దశల్లో జరిగే దేశవ్యాప్త పోటీ పరీక్ష ద్వారా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్‌తో పాటు భాషా సామర్ధ్య పరీక్ష (ఎల్‌పీటీ) కూడా ఉంటుంది. ఇక ఈ పోస్టులకు 20 నుంచి 28 ఏండ్ల లోపు వయసు ఉన్న వారు అర్హులు. ఏదేని గ్రాడ్యుయేషన్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు (ఎస్సీ, ఎస్టీలకు పాస్ మార్క్‌లు ఉండాలి) దరఖాస్తు చేసుకోవచ్చు
పీసీపై వర్డ్ ప్రాసెసింగ్ గురించి అవగాహన ఉండాలి. నిర్ధిష్ట నియామక కార్యాలయం పరిధిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత బాషలో మాట్లాగలగడంతో పాటు ఆ భాషలో రాయడం, మాట్లాడటం, అర్ధం చేసుకోవడం తెలిసిఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆర్‌బీఐ వెబ్‌సైట్ www.rbi.orgలోకి వెళ్లి రిక్రూట్‌మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్‌పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.