కోలీవుడ్ నటి అమలాపాల్ భారీగా రెమ్యూనరేషన్ పెంచినట్లు సమాచారం. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఘోస్ట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో హీరోయిన్గా అమలాపాల్ను చిత్ర యూనిట్ సంప్రదించిందట.
అయితే అమలాపాల్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ వెనకడుగు వేశారని సమాచారం. దీంతో అమలాపాల్, నాగ్ సినిమాలో నటించేందుకు నో చెప్పిందనే టాక్ నడుస్తోంది.