కివీస్ తో జరిగిన రెండో వన్డేలో భారత క్రికెటర్ మిథాలీరాజ్ అరుదైన రికార్డులు సాధించింది. తన కంటే 21 ఏళ్ల చిన్నదైన రిచాఘోష్తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. మిథాలీ మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన 4ఏళ్లకు రిచా జన్మించింది. అలాగే 20ఏళ్ల కెరీర్ పూర్తయిన మొదటి మహిళా క్రికెటర్, కివీస్పై అత్యధిక హాఫ్ సెంచరీలు, రన్స్ చేసిన భారత కెప్టెన్ రికార్డులు నెలకొల్పింది. ధోనీ, కోహ్లి రికార్డులను బద్దలుకొట్టింది.
