ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ నేత,ప్రముఖ నటుడు అలీ కుటుంబ సమేతంగా ని సీఎం ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సీఎంతో జరిగిన భేటీ వివరాలను అలీ వెల్లడించారు. ‘మర్యాదపూర్వకంగా మాత్రమే సీఎంను కలిశా. గత సాధారణ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు. సమయం లేక నేనే వద్దని చెప్పా. ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చాను. పదవి ఇస్తేనే పార్టీలో సేవ చేస్తానని అనలేదు. రాజ్యసభ సీటు ఇస్తారనే విషయం నాకు తెలియదు. అలాంటి సంకేతాలు సీఎం ఇవ్వలేదు’ అని చెప్పారు.
