దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. థర్డ్‌వేవ్ వైరస్ వణించగా.. రోజువారీ కేసులు తగ్గుతుండడంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 27,409 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 82,817 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
మరో 347 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం దేశంలో 4,23,127 యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.23శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,26,92,943కు చేరింది.
ఇందులో 4,17,60,458 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా 5,09,358 మంది ప్రాణాలు వదిలారు. మరో వైపు దేశంలో టీకా డ్రైవ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 173.42 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.