పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో వారం రోజులు మాత్రమే ఉన్న పంజాబ్‌లో రాజకీయం వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ అద్మీ (ఆప్) కీలక నాయకులు ఆదివారం రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొని ప్రత్యర్థులపై విమర్శలకు దిగారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా లూధియానాలో, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫరీద్‌కోట్‌లో, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అమృత్‌సర్‌లో ర్యాలీల్లో ప్రసంగించారు.
కాగా, గతేడాది అమరీందర్ సింగ్‌ను సీఎంగా తప్పించడంపై ప్రియాంక స్పం దించారు. ఈ పరిణామంపై పార్టీ గాంధీ కుటుం బం నుంచి ఒకరు మాట్లాడడం ఇదే తొలిసారి. అమరీందర్ సర్కారును కేంద్రంలోని మోదీ ప్రభు త్వం నడిపిస్తున్నట్లు తమకు తెలిసిందని అందుకే నాయకత్వాన్ని మార్చామని ప్రియాంక చెప్పారు.
వారి రహస్య అవగాహన.. ఎన్నికల పొత్తు రూపంలో ఇప్పుడు బయటపడిందన్నారు. మరోవైపు ఆప్.. ఆర్‌ఎ్‌సఎస్ నుంచి పుట్టిందని విమర్శించారు. గుజరాత్ మోడల్ తెస్తామంటూ 2014లో బీజేపీ మోసం చేసిన వైనాన్ని మర్చిపోవద్దని ప్రజలను హెచ్చరించారు. సోదరుడు రాహుల్ గాంధీతో విభేదాలున్నట్లు యూపీ సీఎం యోగి చేసిన వ్యాఖ్యలను ప్రియాంక తోసిపుచ్చారు. గొడవలన్నీ ప్రధాని మోదీ, అమిత్ షా, యోగి మధ్యనే ఉన్నాయన్నారు.