దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా 44,877 మందికి వైరస్ సోకింది. మరో 684 మంది మరణించారు. 1,17,591 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.భారత్లో కరోనా కేసులు వరుసగా రెండోరోజు తగ్గాయి.
కొత్తగా 44,877 మందికి వైరస్ సోకింది. కొవిడ్ ధాటికి మరో 684 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,17,591 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.యాక్టివ్ కేసులు ప్రస్తుతం 1.43 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,26,31,421
- మొత్తం మరణాలు: 5,08,665
- యాక్టివ్ కేసులు: 5,37,045
- మొత్తం కోలుకున్నవారు: 4,15,85,711