తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి,ప్రస్తుతం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారుతున్నారని వార్తలు గుప్పుమన్న సంగతి తెల్సిందే. ఎందుకంటే ఇటీవల జరిగిన యాదాద్రి లో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా అధికార టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ తో కలిసి ఫొటో దిగడం, సభలో ముఖ్యమంత్రిని ప్రశంసించారు ఎంపీ కోమటిరెడ్డి.
దీంతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తన ప్రాంత అభివృద్ధి కోసమే సీఎంను కలిశానని, వినతిపత్రం సమర్పించానని కోమటిరెడ్డి చెప్పారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఫాంహౌస్ పక్కనే తన భువనగిరి నియోజకవర్గం ఉన్నా ఆయన ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు.