తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ‘ఊసరవెల్లి’ లో నటించిన అందాల రాక్షసి హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తారక్, నెక్స్ట్ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఇందులో ఆలియా భట్ హీరోయిన్గా నటించనుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆలియా స్వయంగా వెల్లడించింది.
అయితే, మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్ కూడా ఎన్టీఆర్ సరసన నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని ఇటీవల తన మనసులో మాటను చెప్పడం అంతటా ఆసక్తికరంగా మారింది.కాగా, గతంలో ఎన్టీఆర్ – తమన్నా జంటగా నటించిన ‘ఊసరవెల్లి’ మూవీలో కీలక పాత్ర పోషించిన యువ నటి పాయల్ ఘోష్.. తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఎన్టీఆర్ మీద దీపికా చేసిన కామెంట్స్ విని పాయల్ స్టన్ అయ్యారు. ‘ఊసరవెల్లి’ సినిమాలో ఎన్టీఆర్ నటన గురించి ఇది వరకే చెప్పాను. అప్పుడు చాలా మంది నన్ను విమర్శించారు. కానీ, ఇప్పుడు అదే నిజం అయ్యింది. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. టాలీవుడ్ ఖచ్చితంగా బాలీవుడ్‌ను మించిపోతుంది.. అని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
