ఉత్తర్‌ప్రదేశ్‌లోని బీజేపీ అభ్యర్థి, మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లాపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. కోవిడ్19 ప్రోటోకాల్ ప్రకారం బైరియా అసెంబ్లీ నియోజకవర్గంలో 144 సెక్షన్ కింద నిషేధిత ఆదేశాలు ఉన్నా.. మంత్రి స్వరూప్ వాటిని ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్తి జై ప్రకాశ్ ఆంచల్‌పైన కూడా ఇదే తరహా కేసు బుక్కైంది. బీజేపీ, ఎస్పీ అభ్యర్థులు ఇద్దరూ ప్రచారం కోసం అనుమతి తీసుకోలేదని బైరియా ఇన్‌స్పెక్టర్ శివ శంకర్ సింగ్ తెలిపారు. అనుమతి లేకుండా ఊరేగింపు తీశారని, దీంతో వాళ్లు ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు ఇన్‌స్పెక్టర్ చెప్పారు.