‘ఖిలాడి’ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో కలిసి పనిచేయడం అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చెప్పింది. సినిమాలో బాగా ఎంజాయ్ చేస్తూ నటించానని ఆమె చెప్పుకొచ్చింది.
రవితేజ ఓ బెస్ట్ కోస్టార్ అని, ఆయన్ను చూస్తే ప్రాణాయామం చేసిన ఫీలింగ్ వస్తుందని అనసూయ పేర్కొంది. రవితేజతో ఇన్నిరోజులు ట్రావెల్ చేసినా.. ఆయన ఎనర్జీ సీక్రెట్ ఏంటో తెలుసుకోలేకపోయానని ఆమె వెల్లడించింది.