తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు తప్పుబట్టారు. బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోయినా వ్యవసాయ బిల్లులను ఆమోదించుకున్నారు. కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు, బీజేపీ మిత్ర పక్షాలు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాయి.
అయినప్పటికీ మూజువాణి ఓటుతో ఆ బిల్లులు పాస్ అయినట్టు రాజ్యసభలో ప్రకటించుకోవడం సక్రమమా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇదెక్కడి రాజ్యాంగ విధానం మోదీ? అని నిలదీశారు.పాలక, ప్రతిపక్షాలతో పాటు 33 పార్టీలు సమర్ధించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు అక్రమమా..? 4 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేయడం ఏం పద్దతి మోదీ? రైతు వర్గం అంతా తీవ్రంగా వ్యతిరేకించినా మీరు వ్యవసాయ బిల్లులు తేవడం న్యాయమా..? అని హరీశ్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రాణాలకు తెగించి సీఎం కేసీఆర్ చేసిన పోరాటం, వందలాది ఉద్యమకారుల ప్రాణత్యాగం ఫలితంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడం అన్యాయమా..? ఇదెక్కడి న్యాయం మోదీ జీ..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
రైతు వర్గం అంతా తీవ్రంగా వ్యతిరేకించినా మీరు వ్యవసాయ బిల్లులు తేవడం న్యాయమా..?
ప్రాణాలకు తెగించి సీఎం కేసీఆర్ గారు చేసిన పోరాటం,వందలాది ఉద్యమకారుల ప్రాణత్యాగం ఫలితంగా. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడం అన్యాయమా..
ఇదెక్కడి న్యాయం మోదీ జీ..
3/3— Harish Rao Thanneeru (@trsharish) February 9, 2022