యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామివారిని సీఎం దర్శించుకున్నారు. యాగస్థలం, మహాకుంభ సంప్రోక్షణ, సుదర్శనయాగం, ఇతర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మార్చి 28న సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం ఆలయ నిర్మాణ పురోగతి గురించి కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
