తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం మేడ్చల్ జిల్లా వారు రూపొందించిన 2022 నూతన సంవత్సర డైరీని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ గారు, మైనంపల్లి హన్మంతరావు గారు బహదూర్ పల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమలో పని చేస్తున్న ప్రైవేటు ఉద్యోగులకు, కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్ యాదవ్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, పిఎసిఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, స్థానిక వైస్ చైర్మన్ టి.పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, భరత్ కుమార్, ఎల్లుగారి సత్యనారాయణ, నిజాంపేట్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, టీఆర్ఎస్ నాయకులు మురళి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, మధన్ రావు, మల్లేష్, వెంకటేశ్, సగ్గిడి శ్రీనివాస్, కొమురయ్య యాదవ్, సత్యనారాయణ యాదవ్, లక్ష్మీ నర్సయ్య, శ్యామ్, పద్మారావు, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, శివా యాదవ్, సంఘం ఉపాధ్యక్షుడు రామకృష్ణ, రాష్ట్ర కోఆర్డినేటర్ ఎల్లాగౌడ్, మేడ్చల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, మీడియా సెల్ విభాగం నాయకుడు చంద్రకాంత్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, కుత్బుల్లాపూర్ నాయకుడు బివి రమణ, దివాకర్, కార్మిక నాయకుడు బోదాసు నరసింహ రాజు, శ్రీనివాస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.