తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు మరోసారి దేశవ్యాప్తంగా గొప్ప పేరును సంపాదించాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేంద్రం సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో భాగంగా ఎంపిక చేసిన తొలి 10 ఆదర్శ గ్రామాల్లో 7 రాష్ట్రం నుంచే ఉండటం అందరికీ గర్వకారణమన్నారు. ఇందులో కరీంనగర్ జిల్లా వెన్నంపల్లి గ్రామం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. పారిశుద్ధ్యం, మౌలిక వసతుల ప్రాతిపాదికన కేంద్రం వీటిని ఎంపిక చేసిందన్నారు.
