ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి సీఎం జగన్తో భేటీ అవడంపై ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. అది పర్సనల్ మీటింగ్ అని, అసోసియేషన్తో సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఏ ఒక్కరో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని, టికెట్ల విషయంలో ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి రావాలని చెప్పారు. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయని, సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.