Home / SLIDER / మానవత్వం చాటుకున్న మంత్రి ఎర్రబెల్లి

మానవత్వం చాటుకున్న మంత్రి ఎర్రబెల్లి

 వరంగల్ – ఖమ్మం రహదారిలో ఆదివారం రాత్రి నాంచారి మడూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. కాగా అదే దారిలో  వెళుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అగి మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రుడిని వెంటనే వైద్య శాలకు తరలించారు. పోలీస్ లతో మాట్లాడి వేగంగా ట్రాఫిక్ నియంత్రణ, పంచనామా, శవ తరలింపు తదితర అంశాలను అక్కడే ఉండి పర్యవేక్షించారు.

పోస్ట్ మార్టం వంటి వాటిని వేగంగా పూర్తి చేయాలని అదేశించారు. రోడ్డు ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకున్నారు.రోడ్లపై ప్రయాణించే వారు తగు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. అతి వేగం హాని కరం. వేగం కన్నా ప్రాణం మిన్న… అజాగ్రత్త తో మీ విలువైన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకోవద్దు. మీపై ఆధార పడిన మీ కుటుంబాలకు న్యాయం చేయవద్దని పిలుపునిచ్చారు.

జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొని మంత్రి  వరంగల్ కు తిరిగి వస్తుండగా, నాంచారి మడూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నారి సోమన్న (35), గుడుగుల్ల నరసింహ అనే వ్యక్తులు బైక్ పై వెళుతూ, అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కార్ ని ఢీ కొట్టి పడిపోయారు. సోమన్నఅక్కడికక్కడే మృతి చెందాడు. నరసింహ తీవ్రంగా గాయపడ్డాడు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat