సరిగ్గా మూడేండ్ల కిందట కణం మూవీ షూటింగ్ సమయంలో సాయిపల్లవితో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ యువహీరో నాగశౌర్య కామెంట్స్ చేశాడు. ఆ వివాదంపై సాయిపల్లవి తాజాగా స్పందించింది.
‘నాగశౌర్య అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయన నాలో నచ్చని గుణం గురించి బయటకు చెప్పారు. నేను దాన్ని పాజిటివ్‌గా తీసుకున్నాను. నా వల్ల అతనికి ఇబ్బంది కలిగి ఉంటే అది నన్ను బాధించే విషయమే. నా సమాధానంతో ఆయన సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నా’ అని చెప్పింది.