కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ప్రాగటూల్స్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో మంచినీటి పైపు లైన్లు, సీసి రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ మేరకు ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. కాలనీలో ఆయా మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధుల ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నాయకుడు పరుష శ్రీనివాస్ యాదవ్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగారెడ్డి, ట్రెజరర్ గోపాల్ రెడ్డి, చీఫ్ అడ్వైసర్ సోమిరెడ్డి, మెంబర్స్ రామారావు, రామ్ రెడ్డి, రవి యాదవ్, మురళి, రిషిరెడ్డి, కొండారెడ్డి, వెంకటేశం పాల్గొన్నారు.