యంగ్ రెబల్ స్టార్ ..స్టార్ హీరో ప్రభాస్ హీరోగా గోపీకృష్ణ మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ,ప్రమోద్ ,ప్రశీద నిర్మించిన రాధకృష్ణకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’ .ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు భారీ లాభాలు వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.
మార్చి నెల పదకొండు తారీఖున విడుదల చేస్తామని చిత్రం యూనిట్ ఇటీవల ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుందని వార్తలు విన్పిస్తున్నాయి. రూ.250కోట్లతో పైగా నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు 400కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్. దీంతో చిత్రం నిర్మాతలకు రూ.150కోట్ల లాభం వచ్చిందని సినీ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
అయితే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో హిందీ,తెలుగు,తమిళ ,కన్నడ,మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు చిత్రం నిర్మాతలు.