పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా కాపౌండ్ కు చెందిన మరో యువ హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారా..?. పవన్ సొంత నిర్మాణ సంస్థ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ లో యంగ్ హీరోల సత్తాను వెలుగులోకి తీసుకురావాలని .. అందుకు యంగ్ హీరోలతో సినిమాలని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇందులో భాగంగా తమిళంలో సూపర్ హిట్ సాధించిన ఓ సినిమాను తెలుగులోకి సాయి ధరమ్ తేజ్ హీరోగా రీమేక్ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన వినోదయ సైతం అనే చిత్రం ఓటీటీలోకి వచ్చి కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్నే సాయిధరమ్ తేజ్ హీరోగా రీమేక్ చేయాలని పవన్ అనుకుంటున్నాడట.చూడాలి మరి ఎప్పుడు అధికారక ప్రకటన వస్తుందో..?