Home / SLIDER / భక్తరామదాసు తెలంగాణ గర్వించదగిన వాగ్గేయ కారుడు

భక్తరామదాసు తెలంగాణ గర్వించదగిన వాగ్గేయ కారుడు

తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన ఉన్నప్రముఖ వాగ్గేయకారుడు, శ్రీరామభక్తుడు, భద్రాచల రామదాసు విగ్రహం వద్ద వారి 389 వ జయంతి ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ.. భక్తరామదాసు తెలంగాణ గర్వించదగిన వాగ్గేయ కారుడని, అయోధ్య తర్వాత అంత గొప్పగా చెప్పుకోదగిన శ్రీరాముని దేవాలయాన్ని నిర్మించి భక్త రామదాసుగా ఎన్నో కీర్తనలు రచించి, శ్రీరాముడి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. భక్త రామదాసు జయంతి ఉత్సవాలను భాషా సాంస్కృతిక శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి వారి జన్మ స్థలమైన నేలకొండపల్లిలో నిర్వహిస్తున్నామన్నారు.

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ జయంతి ఉత్సవాలను కొంచెం తక్కువ స్థాయిలో చేస్తున్నామని రాబోయే సంవత్సరం అత్యంత వైభవంగా భక్తరామదాసు కీర్తిని దశదిశలా చాటేలా నిర్వహిస్తామని వారు తెలియచేశారు. తెలుగు జాతి, సంస్కృతి ఉన్నంత కాలం రామదాసు రచనలు ఉంటాయని, వారి భక్తి, ఆధ్యాత్మిక సంపద భారత దేశానికే గర్వకారణంగా భావించ వచ్చని ఆయన అన్నారు. ఈ జయంతి ఉత్సవాలలో రామదాసు రచించిన నవరత్న కీర్తనల్ని ఆలపించిన శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఉపాధ్యాయ బృందం ని విద్యార్థులని మంత్రి శ్రీ వ్. శ్రీనివాస్ గౌడ్ గారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ,ప్రముఖ విద్యావేత్త రామదాసు, హరిహర ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, దైవజ్ఞ శర్మ, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సంపాదకులు వెంకటేశ్వర రావు, రామదాసు భక్తులు, శాస్త్రీయ సంగీత ప్రేమికులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat