రాజ్యాంగం జోలికి పోతే ముక్కలు ముక్కలు చేస్తా నంటూ బిజెపి నేత బండి సంజయ్ పై,ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన పిసిసి నేత రేవంత్ రెడ్డి పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.జ్ఞానం ఉన్నోడికి చెప్పొచ్చు,లేని వాడికి కనువిప్పు కలిగించొచ్చు కానీ అజ్ఞానులకు ఏమి చెప్పగలం అంటూ ఆయన దుయ్యబట్టారు.నల్లగొండ ను నుడా గా మార్చిన నేపద్యంలో వరంగల్ లో జరుగుతున్న అభివృద్ధి నమూనా ను పరిశీలించేందుకు గాను నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తో కలిసి వరంగల్ లో పర్యటించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి విప్ వినయ్ భాస్కర్,శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గుండు సుధారాణి తదితరులతో కలిసి మీడియా తో మాట్లాడారు.ఈ సందర్భంగా పిసిసి, బిజెపి చీఫ్ లు ప్రస్తావించిన అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీష్ రెద్దు బదులిస్తూబూతులు తిడితే నేతలు అవుతారా అంటూ ఆయన నిలదీశారు. అసలు వారెప్పుడు నాయకులు కారని ఇతర నాయకుల కింద పనిచేసిన వారు ఎప్పుడు యజమానులు కాలేరని ఆయన ఎద్దేవాచేశారు. ఆ మాటకొస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టి ఆర్ యస్ పార్టీ రూపొందించిన ఎజెండాకు ప్రత్యామ్నాయంగా ఎజెండా ను రూపొందించే శక్తి లేని నేతలు వారంటూ విమర్శించారు.
కొత్త రాష్ట్రం అతి చిన్న రాష్ట్రం అభివృద్ధి లో ప్రపంచ చిత్రపటంలో స్థానం దక్కింది అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత మాత్రమే నన్నారు.పట్టణాభివృద్ధి లో రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కలువకుంట్ల తారక రామారావు గారికి ఉన్న పట్టు ప్రపంచంలోనే ఏ మంత్రికి లేదని ఆయన కొనియాడారు. అందుకు ప్రపంచ వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ కు వస్తున్న ఆహ్హనాలే నిదర్శనంగా మరాయన్నారు.60,70 ఏండ్లుగా ఇప్పుడు బహిరంగ లేఖ రాసిన వారి బాస్ ల పాలనలోనే కదా అంతటి విధ్వంసం, దుర్మార్గం జరిగిందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో ఇప్పుడు ఆ పాప ప్రక్షాళన జరుగుతుందన్నారు.రాజ్యాంగం అంటే ముట్టుకొని జడ పదార్థం ఏమి కాదని,ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్చుకోవచ్చని ఆయన చెప్పారు.ఇప్పటి వరకు ఎన్నో సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్న అంశాన్ని ఆయన గుర్తుచేశారు.రాజ్యాంగంలో పీఠిక అంటే ఏందో తెలియని వారు,మొదటి అక్షరం ఎక్కడ మొదలవుతుందో అవగాహన లేని వారు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదంటూ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.