‘మానాడు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సురేష్ కామాక్షి కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. వి హౌస్ ప్రొడక్షన్ బ్యానరులో ప్రొడక్షన్ నెం.7గా నిర్మిస్తున్నారు. ‘తంగమీన్‌గల్’, ‘పేరన్బు’ వంటి మంచి చిత్రాలను తెరకెక్కించిన రామ్ ఈ చిత్రానికి దర్శ కత్వం వహిస్తున్నారు.
ఇందులో నవీన్ పాలి హీరోగా నటిస్తున్నారు. ఈయన ‘రిచీ’ తర్వాత నటించే రెండో చిత్రం. హీరోయిన్గా అంజలి ఎంపికైంది. ఇందులో హాస్య నటుడు సూరి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఇందుకోసం రియలి స్టిక్‌గా ఉండే రైలు ట్రైన్ నిర్మించారు. ఈ సెట్‌ను దర్శకుడు మిష్కిన్ కూడా సందర్శించి చిత్ర బృందంతో ముచ్చటించారు. ప్రస్తుతం ఈ సెట్లోనే షూటింగ్ జరుగుతోంది.