కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని నడిపించే ప్రధాన మంత్రి నరేందర్ మోదీ,తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సెటైరికల్ కామెంట్లు చేసింది .
ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఒకే తానులో ముక్కలని ఆమె విమర్శించారు. రాష్ట్రానికి మోదీ ఇచ్చిందేమీ లేదు..సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదీ లేదన్నారు.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నసీఎం కేసీఆర్.. ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.