దేశంలో పంచాయతీరాజ్ శాఖలో వందశాతం ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈమేరకు రాష్ట్రాన్ని అభినందిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లేఖ రాసింది. కేంద్రం అభినందించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులను ఆయన ప్రశంసించారు. పారదర్శకత, జవాబుదారీతనంలో రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలుపుతున్నారని చెప్పారు.
