తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గ్రానైట్ పరిశ్రమ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యి సమస్యలపై మంత్రి సమీక్షించారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో సమస్యలపై చర్చలు జరిపిన పరిశ్రమ ప్రతినిధులు, స్లాబు విధానాన్ని, 40 శాతం రాయల్టీ రాయితీ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దృష్టికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. కొవిడ్‌తో గ్రానైట్ రంగం బాగా దెబ్బతిన్నదని, 40 శాతం రాయల్టీ రాయితీ రాయితీ, స్లాబ్ విధానం కొనసాగింపుకు అనుమతిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రానైట్ పరిశ్రమల సంబంధిత సమస్యల పరిష్కారం కు ప్రత్యేక చొరవ, కృషి చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ హైదరాబాద్ జిల్లాల గ్రానైట్ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పువ్వాడ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.