నేను కూడా అందుకు రెడీ అంటున్నారు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు హీరోయిన్స్ అందరూ వరుసగా సినిమాలను చేస్తూనే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆరాటపడుతున్నారు. మంచి కాన్సెప్ట్‌తో మేకర్స్ అప్రోచ్ అయితే ఏమాత్రం ఆలోచించకుండా సై అంటున్నారు. ఇప్పటికే సమంత, కాజల్, శృతి హాసన్, తమన్నా, వంటి స్టార్ హీరోయిన్లు ఓటీటీ ప్లాట్ ఫాంస్లో వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.
ఈ క్రమంలో రకుల్ కూడా టాక్ షోస్, వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అంటూ ఓపెన్ అయ్యారు.ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓటీటీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇటీవల కాలంలో ఓటీటీలకు ప్రజల్లో బాగా ప్రాధాన్యత పెరుగుతుంది. ముఖ్యంగా ఓటీటీల కారణంగా రీజనల్ సినిమాలు కంటెంట్ అనేది ఎక్కువ మందికి చేరుతుంది. దీంతో సినిమాల మధ్య ఉన్న భాషా పరమైన హద్దులు చెరిగిపోతున్నాయి.
కథ బావుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే, ఓటీటీలలో టాక్ షోస్, వెబ్ సిరీస్ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అయితే, స్టోరీ నన్ను ఎగ్జైట్ చేయడంతో పాటు అందులో నా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండాలి..అలాంటి వస్తే నేను చేసేందుకు రెడీ’.. అంటూ చెప్పుకొచ్చింది. దీంతో త్వరలోనే రకుల్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అర్థమవుతోంది.