దేశంలో గత రెండు రోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 40 వేల కేసులు తక్కువగా నమోదయ్యాయి.
అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 1,192 మంది వైరస్‌తో మరణించారు. నిన్నటితో పోలిస్తే 250 అధికం. ఇక తాజాగా 2,54,076 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 17,43,059 యాక్టివ్ కేసులు ఉన్నాయి.