Home / SLIDER / గంజాయి, మత్తు పదార్థాలు సాగుచేస్తున్న, రవాణా వారిపై ఉక్కుపాదం

గంజాయి, మత్తు పదార్థాలు సాగుచేస్తున్న, రవాణా వారిపై ఉక్కుపాదం

తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి   శ్రీనివాస్ గౌడ్  వరంగల్ లోని కాకతీయ హరిత హోటల్ లో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ వినయ్ భాస్కర్ గారితో కలసి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ , పోలీస్ శాఖల అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో మంత్రి శ్రీ. వి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ .. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు సాగుచేస్తున్న , రవాణా వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. గంజాయి సాగు చేస్తున్న రైతుల, పండిస్తున్న భూముల వివరాలను సేకరించి రైతుబంధు డబ్బులు రాకుండా వ్యవసాయ శాఖ అధికారులచే ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు.

ఎక్సైజ్, పోలీస్ శాఖ ల అధికారులు సమన్వయంతో గంజాయి రవాణా చేస్తున్న వారిపై, అనుమానితులపై నిఘా ఉంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గంజాయి రవాణా చేస్తున్న సాగుచేస్తున్న వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి బైండోవర్ చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వివిధ విద్యాసంస్థల్లో మత్తు పదార్థాలకు అలవాటు పడిన విద్యార్థులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు , విద్యాసంస్థల నిర్వాహకులకు ఆబ్కారీ శాఖ, పోలీస్ శాఖల అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సూచించారు.

గంజాయి సాగుచేస్తున్నా, రవాణా చేస్తున్న వారిపై, అందుకు సహకారాన్ని అందించే ఎంతటి వారైనా వారిని చట్టరీత్యా కేసులు నమోదు చేసిన అధికారులకు ప్రభుత్వం తరపున అవార్డుల ను అందించి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. గ్రామాల్లో గంజాయి సాగు చేస్తున్నా వారిని యువకులు, ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యతగా భావించి ఆబ్కారీ, పోలీస్ శాఖ ల అధికారులకు సమాచారం అందించాలని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు సూచించారు. గ్రామాల్లో గంజాయి సాగు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రచారం నిర్వహించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రైల్వే, బస్ లలో గంజాయి రవాణా కాకుండా సంబంధిత శాఖల అధికారులతో సంప్రదించి చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ వరంగల్ జిల్లా సూపరిటెండెంట్ శ్రీనివాస రావు, శంషాబాద్ సూపరిటెండెంట్ సత్యనారాయణ, AES కరమ్ చంద్, హనుమకొండ పోలీస్ శాఖ ACP జితేందర్ రెడ్డి, సుబేదారి పోలీసు CI రాఘవేంద్ర, హన్మకొండ ఆబ్కారీ శాఖ CI రామకృష్ణ పోలీసు, ఆబ్కారీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat