ఒక్క తెలుగు సినిమా ప్రేక్షకులే కాకుండా యావత్తు భారత సినిమా ప్రేక్షకులు మొత్తం ఎదురు చూస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ జూనియర్ యన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి మలిచిన ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రం.. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీని మార్చుకుంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా థర్డ్ వేవ్ కారణంగా మళ్ళీ వాయిదా పడింది.
టీజర్స్, సింగిల్స్, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాల్ని ఓ రేంజ్ లో పెంచేశారు. అలాగే.. ప్రమోషనల్ ఈవెంట్స్ తోనూ విపరీతమైన హైప్ ను క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకోసం రెండు విడుదల తేదీల్ని ఖాయం చేశారు. మార్చ్ 18, ఏప్రిల్ 28. ఈ తేదీల్లో ఒకదాన్ని విడుదల తేదీగా ఫిక్స్ చేస్తామని ప్రకటించారు.
తాజా సమాచారం ప్రకారం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. సమ్మర్ కానుకగా విడుదల చేస్తేనే అన్ని విధాల బాగుంటుందన్నది మేకర్స్ ఆలోచనగా తెలుస్తోంది. అప్పటికి థర్డ్ వేవ్ పూర్తిగా తగ్గుముఖం పట్టి.. థియేట్రికల్ రిలీజ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట. ఆ మేరకు ప్రకటన కూడా చేయబోతున్నట్టు సమాచారం.