తెలంగాణ రాష్ట్రంలో మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు చెందిన అనుబంధ సంస్థ డ్రిల్ మెక్ స్పా (ఇటలీ) చమురు రిగ్గులు,దాని అనుబంధ పరికరాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నది.
దీని గురించి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు సమక్షంలో ఈ రోజు సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నది. భారీ పెట్టుబడితో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆ సంస్థ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.