Home / SLIDER / బడ్జెట్ సమావేశాల్లో BJP ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలి

బడ్జెట్ సమావేశాల్లో BJP ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలి

తెలంగాణలో బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిచినా రాష్ర్టానికి కేంద్రం నుంచి ఏమీ తేలేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ ఆరోపించారు. ఢిల్లీలో ఉండి అభివృద్ధి నిధులు తేవాల్సిన ఎంపీలు రాష్ట్రంలో ఉంటూ ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ సమావేశంలో ప్రారంభమైన దృష్ట్యా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రయోజనాల విషయంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన వివక్షను ప్రదర్శిస్తున్నదని, దీనిని ఎండగట్టాలని బీజేపీ ఎంపీలను మంత్రి అజయ్ డిమాండ్ చేశారు. ప్రతిసారి బడ్జెట్ సమావేశాల్లో జిల్లాకు కేంద్ర మొండి చెయ్యి చూపటం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, రవాణా అభివృద్ధికి చర్ల నుంచి ఏపీలోని రాజమండ్రి వరకు గోదావరి జల మార్గం ఏర్పాటు ద్వారా కాకినాడ పోర్టుకు తరలింపు, భద్రాచలం – కొవ్వూరు, మణుగూరు – రామగుండం రైల్వే ప్రాజెక్టులు, ఉత్తరాదిన గంగా నది తరహాలో గోదావరి నది కాలుష్య నివారణ కు కేంద్ర నిధులు మంజూరు వంటి తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీసి, సాధించాలని హితవు మంత్రి పలికారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీలను, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు విద్య, ఉపాధి సంస్థలను జిల్లాలో నెలకొల్పే విధంగా నిధులు కేటాయించాలని మంత్రి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏపీ, తెలంగాణ సరిహద్దును ఉన్న గ్రామ పంచాయితీల విలీనం, ఆ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.కొత్తగూడెం విమానాశ్రయం ప్రతిపాదన చేసిన కార్యరూపం దాల్చలేదన్నారు. దేశంలో దక్షిణ అయోధ్య గా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం కు రవాణా సౌకర్యం కొరకు పాండురంగాపురం నుంచి సారపాక వరకు, భద్రాచలం – కిరండోల్ రైల్వే లైన్ నిర్మాణం పై దృష్టి సారించాలని మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు.

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన సంస్థలు, నిధులు, చట్టప్రకారం ఏర్పాటు చేయాల్సిన పరిశ్రమలపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసినా, ఎన్ని లేఖలు రాసినా కేంద్రం స్పందించడంలేదన్నారు. దశాబ్దాలుగా వివక్షకు గురై, సుదీర్ఘ పోరాటాల అనంతరం కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణను ఉదారంగా ఆదుకోవాల్సిన కేంద్రం ఏడేండ్లుగా చిన్నచూపు చూస్తున్నదని రాష్ర్టానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై బీజేపీ నాయకులు ఏనాడూ నోరెత్తింది లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ద్వజమెత్తారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat