తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం కొత్తగా 2,484 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆదివారం మొత్తం 65,263మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.61లక్షలకు చేరుకుంది.
తాజాగా 4,207మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తంగా 7.18లక్షల మంది కరోనా నుండి కోలుకున్నారు. అయితే ఆదివారం కరోనాతో ఒకరు మరణించగా ఇప్పటివరకు 4,086మంది కరోనాతో మరణించారు.
ప్రస్తుతం 38,723 క్రియాశీలక కరోనా కేసులున్నాయి. వీటిలో 3,214మంది ప్రభుత్వ ప్రయివేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.వీరిలో 843మంది ఐసీయూలో ,1,319మంది ఆక్సిజన్ ,సాధారణ పడకలపై 1,052మంది ఉన్నారు.