తనకూ సైబర్ వేధింపులు ఎదురయ్యాయని బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తాజాగా వెల్లడించారు. ఇంటర్నెట్‌లో అవహేళన చేయడం, బెదిరింపులు నిత్యం ఉటాయని, వాటిని బాలికలు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె పిలుపునిచ్చారు.
జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ‘‘ఇస్మార్ట్ సైబర్ చైల్డ్’’ పేరుతో తెలంగాణ మహిళల భద్ర త విభాగం శనివారం వెబినార్ నిర్వహించింది. ఇందులో పీవీ సింధు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
‘‘సైబర్ నేరాల బారిన పడితే, వెంటనే సమీపంలోని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయం డి. రాష్ట్రంలో షి-టీమ్స్ మహిళల భద్రతకు భరోసా కల్పిస్తున్నాయి. ’’ అని సింధు తెలిపారు. కాగా.. ఆన్‌లైన్ మోసాలపై 3300 విద్యార్థులు, 1650 మంది ఉపాధ్యాయులకు అవగాహన కల్పించామని మహిళల భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా వివరించారు.