ఒమిక్రాన్ బారినపడినా.. 3-4 రోజుల్లోనే ఎక్కువమంది కోలుకుంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ చాలా మందిలో గొంతుకే పరిమితమవడంతో .. ఆస్పత్రుల్లో చేరికలు స్వల్పంగా ఉంటున్నాయి.
జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు తగ్గినా.. దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం వంటివి మాత్రం వదలట్లేదు. వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లక్షణాలకు అనుగుణంగా మందులు వాడితే నయమవుతుందంటున్నారు నిపుణులు.