తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ధర్మపురి ఎంపీ అర్వింద్, రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే అశన్నగారి జీవన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డిని 50 వేల మెజార్టీతో ఓడిస్తానన్న అర్వింద్ వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి స్పందించారు. ‘ఆర్మూర్ లో పోటీ చేస్తానన్న అర్వింద్ సవాల్ స్వీకరిస్తున్నా. ఆయనకు డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిస్తా’ అని జీవన్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు తెస్తానని మాట తప్పిన ఎంపీ అర్వింద్ పై రైతులు ఆగ్రహంగా ఉన్నారన్నారు.