అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత నందమూరి తారకరామారావు అన్నగారి వారసులమన్న మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.
నందమూరి తారకరామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే తాము మాత్రం ఆయనపై గౌరవంతో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టామని చెప్పారు. నందమూరి తారకరామారావును చంద్రబాబు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని గుర్తుచేసుకున్నారు.